2007లో జరిగిన తెలుగు సినీ పరిశ్రమ వజ్రోత్సవాల వేడుకలో చిరంజీవికి ‘లెజెండరీ’ అవార్డును ప్రదానం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయంపై చిరంజీవి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఇంకా సినీ రంగంలో చురుకుగా ఉన్నానని, తన కంటే ముందు తరం నటులు అయిన డా. డి. రామానాయుడు, డీవీఎస్ రాజు వంటి వారితో తనను పోల్చడం సరికాదని అన్నారు. తన సమకాలీనులైన వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణలతో తనను పోల్చి చూస్తే తాను లెజెండ్‌గా అర్హత లేదని అభిప్రాయపడ్డారు.
ఈ కారణంగా ఈ అవార్డును తాను తీసుకోవడానికి నిరాకరించి, దాన్ని టైమ్ కాప్సూల్‌లో ఉంచాలని నిర్ణయించారు. తెలుగు సినిమా 100 సంవత్సరాల వేడుకలో తాను ఇంకా సినీ రంగంలో ఉంటే.. తన తోటి హీరోలు అంగీకరిస్తే ఆ సమయంలో ఈ అవార్డును అందుకోవాలని అన్నారు.
ఈ సంఘటనలో డా.మోహన్ బాబు కూడా ముఖ్య పాత్ర పోషించారు. చిరంజీవికి లెజెండరీ అవార్డు ఇవ్వాలనే నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. లెజెండ్ మరియు సెలబ్రిటీ అనే పదాలకు స్పష్టమైన నిర్వచనం లేకుండా వాటిని వాడటాన్ని ఆయన తప్పుబట్టారు.
తాజాగా అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డును అందుకున్న తర్వాత చిరంజీవి వజ్రోత్సవాల వేడుకలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను ఇంట గెలవలేకపోయానని, కానీ ఇప్పుడు ఏఎన్‌ఆర్ అవార్డును అందుకోవడం ద్వారా ఇంటా గెలిచానని, రచ్చా గెలిచానని అన్నారు.