పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్.. ఈ పవర్ ప్యాక్డ్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. చాలా గ్యాప్ వచ్చినా ఫైనల్ గా సెట్ అయింది. సెట్స్ పైకీ వెళ్లింది. ఇంతలోనే గ్యాప్. అటు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా యమా యాక్టివ్ అయ్యాడు.అయినా త్రివిక్రమ్ సూచన మేరకు ముందుగా బ్రో సినిమాను పూర్తి చేశాడు.
ఇటు హరీష్ డైరెక్షన్ లో స్టార్ట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఇచ్చిన ఒక్క షెడ్యూల్ లోనే అదిరిపోయే అవుట్ తీశాడు హరీష్ శంకర్. అది చూసి ఫ్యాన్స్ కూడా ఇది కదా మాకు కావాల్సింది అనుకున్నారు. బట్ ఇంతలోనే మళ్లీ ఈ మూవీ ఆగిపోయింది. మరోవైపు 2024 ఎన్నికల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం చాలా కాలం వేచి చూశాడు హరీష్. తీరా మొదలయ్యాక ఆగిపోతే అతనికి చాలా సమస్యగానే ఉంటుంది. దీంతో ఆ మధ్య హరీష్ వేరే ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి.
బట్ ఇవేవీ కాదు. ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే వస్తున్నాడట. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ దర్శకుడికి డేట్స్ కూడా ఇచ్చి మొత్తం సిద్ధం చేసుకోమని చెప్పాడట. అంతేకాదు.. ఈ సినిమా ఎన్నికలకు ముందే విడుదలవుతుందీ అని ఖచ్చితంగా వినిపిస్తోంది. సో.. బ్రో పోయినా.. ఈ మూవీ మళ్లీ బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తుందని అభిమానులు ఆనందంగా ఫీలవుతున్నారు.