“ఊర్వశివో రాక్షసివో” కుటుంబం మొత్తం చూసే సినిమా

‘‘నిజజీవితంలో అనూ ఇమ్మాన్యుయేల్‌ చాలా స్ట్రెయిట్‌ ఫార్వడ్‌ అమ్మాయి. కెరీర్‌లో వేసే ప్రతి అడుగు మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. సింధూ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అది నాకు, సింధూకి ఉన్న పోలిక’’ అని అనూ ఇమ్మాన్యుయేల్‌ అన్నారు. అల్లు శిరీష్‌ సరసన ఆమె నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. రాకేష్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలిలేని, విజయ్‌ ఎం నిర్మించారు. ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్‌ అను ఇమ్మాన్యూయేల్‌ చెప్పుకొచ్చిన ముచ్చట్లు…

ఇందులో సింధూ అనే సాఫ్ట్‌వేర్‌ అమ్మాయిగా నటించా. కెరీర్‌లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. ఆమెకి ప్రేమ కావాలి. కానీ ప్రేమే జీవితం అనుకోదు. అలాంటి అమ్మాయికి శ్రీకుమార్‌ అనే సింపుల్‌ కుర్రాడు పరిచయం అవుతాడు. సింపుల్‌ కుర్రాడికి, కెరీర్‌ ఓరియెంటెడ్‌ అమ్మాయికి మధ్య ప్రేమకథ ఎలా నడించింది అన్నది కథ. హీరో, హీరోయిన్‌ క్యారెక్టర్స్‌ డిఫరెంట్‌ మైండ్‌సెట్‌తో కాంట్రాస్ట్‌గా ఉంటాయి. అదే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. న్యూ ఏజ్‌ జానర్‌ కథ ఇది. యూత్‌ని బాగా ఇంపాక్ట్‌ చేస్తుంది. 

అరవింద్‌గారు ముఖ్య కారణం…

ఈ కథ ఎంపిక చేసుకోవడానికి చాలా కారణాలున్నాయి. మొదట బన్నీవాస్‌ ఈ కథతో నా దగ్గరకు వచ్చారు. సబ్జెక్ట్‌ విన్