అక్టోబర్ రేసులోకి మరో సినిమా చేరింది. అక్టోబర్ లో దసరా కానుకగా తమిళం నుంచి ‘కంగువ, వెట్టైయాన్’ సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. కన్నడ నుంచి ‘మార్టిన్’ కూడా రంగంలో ఉంది. లేటెస్ట్ గా మరో కన్నడ చిత్రం ‘UI’ అక్టోబర్ లోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా కూడా దసరా కానుకగా రాబోతున్నట్టు శాండల్‌వుడ్ టాక్.
‘UI’ సినిమాలో నటించడమే కాకుండా.. ఉపేంద్ర స్వయంగా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సర్రియలిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి న్యూ పోస్టర్ రిలీజయ్యింది. ఈ పోస్టర్ లో ఉపేంద్ర ఓ భయానక అవతారంలో కనిపిస్తున్నాడు. ఆద్యంతం ఫ్యూచరిస్టిక్ బ్యాక్ డ్రాప్ తో ఈ పోస్టర్ విలక్షణంగా ఆకట్టుకుంటుంది.
‘UI ది మూవీ’లో రీష్మా ననయ్య, మురళి శర్మ, సన్నీ లియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళి కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ వంటి వారు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లహరి ఫిల్మ్స్, జీ మనోహరన్ & వీనస్ ఎంటర్టైనర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘UI ది మూవీ’ కన్నడ సినిమా పరిశ్రమలో గేమ్ ఛేంజర్ అవుతుందనే అంచనాలున్నాయి.