తెలుగులో ప్రజాదరణ పొందిన మలయాళీ నటుల్లో ఉన్ని ముకుందన్ ఒకడు. ‘జనతా గ్యారేజ్, భాగమతి, యశోద’, మాలికాపురం‘ వంటి చిత్రాలు ఉన్ని ముకుందన్ కి తెలుగులో మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఈనేపథ్యంలోనే.. మలయాళంలో ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ‘మార్కో‘ చిత్రాన్ని తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి హనీఫ్ అదేని దర్శకుడు. ఈ మూవీలో మరో మలయాళీ స్టార్ నివిన్ పాలీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ‘మార్కో‘ క్రిస్టమస్ బరిలో విడుదలకు ముస్తాబవుతుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఆకట్టుకున్న ‘మార్కో‘ మూవీ నుంచి టీజర్ రిలీజయ్యింది.