Balakrishna: ఫ్లూట్ జింక ముందు ఊదు అంటోన్న బాలయ్య కొత్త విలన్

నందమూరి బాలకృష్ణ(Balakrishna) సినిమాల్లో ఆయన పాత్రల ఎంత బలంగా ఉంటాయో.. విలన్ పాత్రలూ అంతే బలంగా ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు సరికొత్త విలన్స్ ను సెట్ చేస్తుంటారు మేకర్స్. పైగా బాలయ్య విలన్ అంటే కౄరత్వానికి పరాకాష్టలా ఉండాలి. అఖండ(Akhanda) కోసం ఓ కొత్త నటుడుని తీసుకువచ్చారు.

అలాగే మ్యాన్లీ హీరో శ్రీకాంత్ ను కౄరంగా మార్చారు. వీర సింహారెడ్డి కోసం కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ని తెచ్చారు. అతని గెటప్పే జనాన్ని భయపెట్టింది.

ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమా కోసం బాలీవుడ్ నుంచి ఒకప్పటి హీరో అర్జున్ రాంపాల్ ను తీసుకువచ్చారు. అతను వస్తూనే బాలయ్య లెజెండ్ సినిమాలోని ‘ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు’ అంటూ తెలుగులో డైలాగ్ చెబుతూ తనను తాను పరిచయం చేసుకున్నాడు.

అఫ్‌ కోర్స్ ఇది దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన సెటప్పేలే. అర్జున్ రాంపాల్(Arjun Rampal) తో బాలయ్య ఫైట్స్ అంటే ఊహించుకోవడానికే ఓ రేంజ్ లో ఉంటుంది. మరి అతని పాత్రను అనిల్ ఎలా డిజైన్ చేశాడో కానీ అర్జున్ కు ఇదేఫస్ట్ తెలుగు మూవీ కావడం విశేషం.ఇక బాలయ్య ఈ చిత్రంలోఇప్పటి వరకూ చేయని పాత్రలోకనిపించబోతున్నాడు. అతనికి శ్రీ లీల(Sri Leela) కూతురుగా నటిస్తోంది. కాజల్ అగర్వాల్( Kajal Agarwal) హీరోయిన్.

అనిల్ రావిపూడి స్టైల్లో ఉంటూనే బాలయ్య ఇమేజ్ ను ఎలివేట్ చేసేల ఈ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నాడు అనిల్ రావిపూడి.

ఇక జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ లేదా టీజర్ ను విడుదల చేస్తారు అనుకుంటున్నారు ఫ్యాన్స్. సినిమాను మాత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేయబోతున్నారు.

Related Posts