Alluarjun : అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ .. మరోసారి

కొన్ని కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ వేరే. ఇంక అవి బ్లాక్ బస్టర్ కాంబోస్ అయితే బాక్సాఫీస్ కు ముందే పూనకాలు వస్తాయి. బిజినెస్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటిదే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్. వీరి కలయికలో గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే అల వైకుంఠపురములో మాత్రం ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. ఈ మూవీ తర్వాతే అల్లు అర్జున్ కు ప్యాన్ ఇండియన్ రేంజ్ లో ఆడియన్స్ అటెన్షన్ పెరిగింది. ఈ పాటలకు ఓ రేంజ్ లోక్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ పుష్పకు బాగా ప్లస్ అయింది.


ప్రస్తుతం అల్లు అర్జున్ ”పుష్ప2” ది రూలింగ్ మూవీ చేస్తున్నాడు. ఇటు త్రివిక్రమ్ మహేష్‌ బాబుతో మూవీ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఈ న్యూస్ చాలా రోజులుగా వినిపిస్తోంది.

అయితే రీసెంట్ గా త్రివిక్రమ్ ఓ కథను అల్లు అర్జున్ కు నెరేట్ చేశాడట. ఈ కథ నచ్చడంతో చిన్న చిన్న మార్పులతో ఐకన్ స్టార్ ఓకే అనేశాడు అంటున్నారు. సో.. వీళ్లిద్దరి ప్రస్తుత ప్రాజెక్ట్స్ పూర్తి కాగానే మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్‌స్ అవుతుంది.


అయితే అల వైకుంఠపురములోలాగానే ఈ చిత్రాన్ని హారిక హాసినితో పాటు గీతా ఆర్ట్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటుందట. హీరోయిన్ మేటర్ అప్పుడే చెప్పలేం కానీ.. దాదాపు అల వైకుంఠపురములో చిత్రానికి పనిచేసిన టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికీ పనిచేస్తుందని టాక్. మొత్తంగా అల్లు అర్జున్ నెక్ట్స్ ఏంటీ అనే ప్రశ్నకు సమాధానం వచ్చేసినట్టే అనుకోవచ్చు.

Related Posts