HomeMoviesటాలీవుడ్నవంబర్ లో 'పుష్ప 2' నుంచి ట్రిపుల్ ధమాకా!

నవంబర్ లో ‘పుష్ప 2’ నుంచి ట్రిపుల్ ధమాకా!

-

డిసెంబర్ 5 నుంచి వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప 2’ ప్రభంజనం మొదలవ్వబోతుంది. దీంతో.. ఇకపై ఈ సినిమా ప్రచారాన్ని మరింత వేగవంతం చేయబోతున్నారు. మొత్తంగా.. ‘పుష్ప 2’లో ఐదు పాటలుంటాయట. వీటిలో ఇప్పటికే రెండు పాటలను విడుదల చేశారు. రెండూ సూపర్ డూపర్ చార్ట్‌బస్టర్స్ అయ్యాయి.

ఇక.. నవంబర్ నెలలో ఈ సినిమా నుంచి మరో రెండు పాటలు విడుదల చేయనున్నారట. మిగిలిన ఒక పాటను మాత్రం థియేటర్లలోనే చూడాల్సి ఉంది. అలాగే.. మోస్ట్ అవైటింగ్ ‘పుష్ప 2’ ట్రైలర్ ను కూడా నవంబర్ లోనే రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు మేకర్స్. మొత్తంగా.. నవంబర్ నెలలో ‘పుష్ప 2’ నుంచి ట్రిపుల్ ధమాకా ఖాయం అని చెప్పొచ్చు.

ఇవీ చదవండి

English News