HomeMoviesటాలీవుడ్'మా నాన్న సూపర్‌హీరో' ట్రైలర్.. కొత్త కోణంలో తండ్రీకొడుకుల అనుబంధం!

‘మా నాన్న సూపర్‌హీరో’ ట్రైలర్.. కొత్త కోణంలో తండ్రీకొడుకుల అనుబంధం!

-

నవదళపతిగా కొత్త బిరుదును అందుకున్న సుధీర్ బాబు.. ఇప్పుడు తన కథల విషయంలో కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. రొటీన్ ఫార్ములా మూవీస్ ని పక్కన పెట్టి సరికొత్త కథలను ఎంచుకుంటున్నాడు. ఈకోవలోనే సుధీర్ బాబు నటించిన చిత్రం ‘మా నాన్న సూపర్‌హీరో’. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు.

Ma Nanna Super Hero 2

ఈ సినిమాలో కన్న తండ్రి, పెంచిన తండ్రి మధ్య నలిగిపోయే కొడుకు పాత్రలో సుధీర్ బాబు కనిపించబోతున్నాడు. సుధీర్ కి కన్న తండ్రిగా సాయిచంద్, పెంచిన తండ్రి పాత్రలో షాయాజీ షిండే నటించారు. ‘లూజర్’ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ కంకర ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆర్ణ, రాజు సుందరం, శశాంక్, ఆమని వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వి సెల్యులాయిడ్స్ పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. జేయ్ క్రిష్ సంగీతాన్ని సమకూర్చాడు. దసరా కానుకగా అక్టోబర్ 11న ‘మా నాన్న సూపర్‌హీరో’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇవీ చదవండి

English News