టాలీవుడ్ లో విషాదం.. దర్శకుడు మృతి

టాలీవుడ్ లో అనుకోని విషాదం నెలకొంది. ఎన్ఎస్ఆర్ ప్రసాద్ అనే దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశారు. ఇండస్ట్రీలో సీతారామ్ అనే పేరుతో ఆయన్ని పిలుచుకుంటారు. ఈయన 2005లో డి రామానాయుడు నిర్మించిన నిరీక్షణ అనే చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయ్యారు. అంతకు ముందు చాలా సినిమాలకు ఎంతోమంది దర్శకుల వద్ద రచయితగా పనిచేశారు.

ఘోస్ట్ రైటర్ గానూ కొన్ని చిత్రాలకు పనిచేశారు. ఇలాంటి టాలెంటెడ్ రైటర్స్ ను గుర్తించి ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉండే రామానాయుడు గారు ఆయనకు దర్శకుడుగా అవకాశం ఇవ్వడంతో కెరీర్ గొప్పగా ఉంటుందనుకున్నారు. కానీ సినిమాలేవీ అంతగా విజయం సాధించలేదు. నిరీక్షణ తర్వాత శ్రీకాంత్ తో శతృవు అనే సినిమా చేశారు. అలాగే నవదీప్ తో నటుడు చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో కూడా రెక్కీ అనే సినిమా రూపొందించారు. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సమయంలో ఆయన కన్నుమూయడం విషాదం అనే చెప్పాలి.
సీతారామ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాలోని “జంగారెడ్డిగూడెం”.

Related Posts