తమిళ దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లోని మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘లియో’. ‘మాస్టర్’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా అవడంతో ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా విజయ్ సరికొత్త గెటప్ తో ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ సరసన చాన్నాళ్ళ తర్వాత అందాల త్రిష హీరోయిన్ గా ఈ చిత్రంలో ఆడిపాడబోతోంది. జెట్ స్పీడులో సినిమాలను కంప్లీట్ చేసే లోకేష్ కనకరాజ్ ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ను చాలా షార్ట్ పీరియడ్ లో పూర్తి చేశాడు.

దసరా కానుకగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా ‘లియో’ థియేటర్స్ లోకి రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచారంలో స్పీడు పెంచుతున్నారు మేకర్స్. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ స్వరపర్చిన పాటలు కూడా కొన్ని విడుదలయ్యాయి. లేటెస్ట్ గా ‘లియో‘ మూవీ ట్రైలర్ కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 5న ‘లియో‘ ట్రైలర్ విడుదలవుతోంది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజులో జరిగింది. ఈ సినిమా థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్ అన్నీ కలిపి రూ.422 కోట్లు పలికాయట. అందుకే దసరా బరిలో పాన్ ఇండియా లెవెల్ లో మంచి అంచనాలతో వస్తోన్న సినిమాల్లో ‘లియో‘ని ప్రథమంగా చెప్పొచ్చు.