రెబెల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘కల్కి 2898 ఎ.డి.‘ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే.. గత రెండు, మూడు రోజులుగా ‘కల్కి‘ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది. ట్రైలర్ వస్తోందని అని చెబుతూనే.. ఈ సినిమా నుంచి అమితాబ్, దీపిక, ప్రభాస్ ఇలా.. ఒక్కొక్కటిగా కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఆ హైప్ ను మరింత పెంచేస్తోంది టీమ్.
ఇక.. ఈరోజే ‘కల్కి‘ ట్రైలర్ రాబోతుందని కొన్ని రోజుల క్రితమే అనౌన్స్ చేసింది టీమ్. అయితే.. ట్రైలర్ రిలీజ్ టైమ్ పై ముందుగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. లేటెస్ట్ గా చిత్రబృందం నుంచి ఆ క్లారిటీ వచ్చేసింది. ఈరోజు రాత్రి 7 గంటలకు ‘కల్కి 2898 ఎ.డి.‘ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. అందుకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ కూడా వదిలింది టీమ్. ‘కల్కి‘లోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన ఈ పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.