డిజే టిల్లు.. లాస్ట్ ఇయర్ మొత్తం ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన సినిమా. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ మూవీ డైలాగ్స్ అన్నీ ఆడియన్స్ కు కంఠస్తం అయిపోయాయి.ఆ రేంజ్ లో ఆకట్టుకున్నాడు సిద్ధు. తనే కథ, స్క్రీన్ ప్లే రాసుకున్న సినిమా ఇది.
సితార బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రిజల్ట్ వచ్చింది. ఇక ఫస్ట్ పార్ట్ లోనే సెకండ్ పార్ట్ కు పర్ఫెక్ట్ లీడ్ ఇచ్చాడు సిద్ధు. అందుకే ఇప్పుడు “డిజే టిల్లు స్క్వేర్” అంటూ మరో పార్ట్ తో వస్తున్నాడు. ఈ సారి హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది.
ఈ నెల 26న ఈ చిత్రం నుంచి ‘టికెటే కొనకుండా’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్ అనౌన్స్ మెంట్ కోసం అద్దిరిపోయే ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తే డిజే టిల్లు స్క్వేర్ అనే మాట నిలబెట్టుకునేలానే ఉన్నారు.
ఒక పార్టీలో సిద్ధు, అనుపమ కలుసుకుంటారు. అక్కడ తన షూ పాలిష్ చేసుకుంటూ ఉంటాడు సిద్ధు. ఆమెను ఫస్ట్ చూస్తాడు అతను అనేలా ఉందీ సీన్. తనను చూస్తూ.. “మనసు విరిగినట్టుంది.. ఎక్కడ్నో.. ఉన్నడా బోయ్ ఫ్రెండూ.. “అని అడుగుతాడు.”నీకెందుకు” అంటుంది అనుపమ. ” ఆ ఉంటే నా షూ నేనేసుకునెళ్లిపోతా.. “అనేది టిల్లు ఆన్సర్. ‘లేదంటే’ అనేది ఆ పిల్ల నెక్ట్స్ క్వశ్చన్. దీనికి ఏ మాత్రం తడుముకోకుండా.. “నిన్నేసుకునిబోతా” అంటాడు టిల్లు. దీనికి ఇప్పుడే కదరా కలిశాం.. అప్పుడే ఓపెన్ గా ఫ్లర్ట్ చేస్తావా.. అంటుంది అనుపమ. ఓపెన్ గా అంటే ఇప్పుడు నిన్ను ఫ్లర్ట్ చేస్తున్న సంగతి నీకు తెలవాలగద మరి..లేకపోతే చేసి ఉపయోగం ఏమున్నది అంటూ తన స్టైల్లో అంటాడు టిల్లు.
ఈ సంభాషణ చూసిన తర్వాత టిల్లుతోని తిరిగేఓ పోరడు అంటడు.. “పోయినసారి అంతైనా కూడా సిగ్గురాలే టిల్లు అన్నకి” అంటాడు. ఇక్కడి నుంచి ఆ టిక్కెట్టే కొనకుండా అనే పాట మొదలవుతుంది అనుకోవచ్చు.మొత్తంగా ఈ ప్రోమోతోనే మళ్లీ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ ఇస్తున్నాం అనేలా ఉన్నాడు సిద్ధు. ఇక ఈ పాట కూడా ఈ యేడాది మొత్తం మార్మోగిపోతుంది అని చెబుతున్నాడు. చూద్దాం.. మరి ఈ టిల్లు స్క్వేర్ ఇంకెంత ఎంటర్టైన్ చేస్తుందో.