టైగర్ దేశభక్తి నిరూపించుకోవాలా

ఈద్ వచ్చిందంటే పండగ జోష్ ను డబుల్ చేస్తూ ప్రతి యేడాదీ సల్మాన్ ఖాన్ సినిమా కూడా వస్తుంది. ఈ సారి కూడా మరోసారి టైగర్ గా రాబోతున్నాడు భాయ్. యశ్ రాజ్ ఫిల్మ్స్ వారి స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన సినిమాల్లో టైగర్ సిరీస్ లో ఇది మూడోది.

ఇంతకు ముందు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలున్నాయి. ఇప్పుడు టైగర్ 3 అంటూ రాబోతున్నాడు. అయితే యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో ఏక్ థా టైగర్ ను చేర్చలేదు. మొత్తంగా టైగర్ సందేశం అంటూ ఈ మూవీ నుంచి ఓ టీజర్ లాంటి వీడియో వదిలారు.

ఈ వీడియో చూస్తే ఈ యేడాది మరో వెయ్యి కోట్ల సినిమా రాబోతున్నట్టే అని ఫిక్స్ అయిపోయేలా ఉంది. ఆల్రెడీ పఠాన్, జవాన్ తో షారుఖ్ ఖాన్ బాలీవుడ్ కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. దాన్ని కంటిన్యూ చేసేందుకే టైగర్ 3 ఎంట్రీ ఉంటుందా అనేలా ఉంది. ఇక 20యేళ్లుగా దేశం కోసం పనిచేసిన టైగర్ కు తన దేశ భక్తిని నిరూపించుకోవాల్సిన సమస్య వస్తుంది. పైగా తనను దేశ ద్రోహిగా చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ దేశానికే ఓ సందేశం ఇస్తున్నట్టుగా ఉన్న ఈ టైగర్ సందేశంలో ఏముందంటే..


“నా అసలు పేరు అవినాష్ సింగ్ రాథోడ్. మరి మీ అందరికీ నేను టైగర్ ని. 20యేళ్లుగా నా జీవితాన్ని ఇండియా సంరక్షణకే వెచ్చించాను. దానికి బదులు నేనేమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. ఇవాళ మీ అందరికీ చెబుతున్నారు. టైగర్ మీ శతృవు అని. టైగర్ దేశద్రోహి అని. టైగర్ ఈజ్ ఎనీమి నెంబర్ వన్. 20యేళ్ల సర్వీస్ తర్వాత నేను ఇండియానే నా క్యారెక్టర్ సర్టిఫికెట్ అడుగుతున్నాను. నా కొడుక్కి నేను కాదు.. ఇండియా చెబుతుంది తన తండ్రి ఎవరు.. అని. దేశ ద్రోహా, దేశ భక్తుడా అని.. బ్రతికి ఉంటే నేను మళ్లీ మీ సేవకే వస్తాను.. లేదంటే.. జై హింద్.. ” అంటూ సాగిన ఈ సందేశంతో పాటు కనిపించిన యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తే అబ్బో.. జవాన్ తర్వాత ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరయ్యే మరో యాక్షన్ ఎంటర్టైనర్ గ్యారెంటీ అనిపించేలా ఉంది.


ఇక చివరగా.. టైగర్ కు శ్వాస ఉన్నంత వరకూ ఈ టైగర్ ఓటమిని ఒప్పుకోడు.. అనే ఫినిషింగ్ డైలాగ్ ను బట్టి చూస్తే టైగర్ 4కు లీడ్ ఈ సందేశంలోనే ఇచ్చారనుకోవచ్చు.

Related Posts