కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.  భారీ స్థాయిలో తెరకెక్కుతున్న బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానుంది. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు.  

ఇప్పటికే విడుదలైన ‘బనారస్‌’ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ‘తొలితొలి వలపే’ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. లవ్లీ రొమాంటిక్ ట్రాక్ ఈ పాట వీక్షకులని ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు జనీష్ లోక్‌నాథ్ ప్లజంట్ మెలోడి ట్యూన్ కంపోజ్ చేసిన ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించే శ్రావ్యంగా వుంది.పాటలో  జైద్ ఖాన్, సోనాల్ మోంటెరో ల కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. గాయకులు కార్తీక్, కెఎస్ చిత్ర ఈ పాటని పాడిన తీరు మార్వలెస్ అనిపించింది. కృష్ణకాంత్, భాస్కరభట్ల అందించిన సాహిత్యం మరింత ఆకర్షణగా నిలిచింది.చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, అద్వైత గురుమూర్తి డీవోపీగా,  కెఎం ప్రకాష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.