HomeMoviesటాలీవుడ్'దేవర' నటీనటుల పారితోషికాలు ఇవే!

‘దేవర’ నటీనటుల పారితోషికాలు ఇవే!

-

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ, బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈనేపథ్యంలో.. ఈ చిత్రం సాధిస్తోన్న వసూళ్లు.. దాని వెనుక ఉన్న భారీ బడ్జెట్, నటీనటుల పారితోషికాల గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది.

Devara 14

‘దేవర’ సినిమాను దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రధాన నటుడు ఎన్టీఆర్ రూ.60 కోట్లు, జాన్వీ కపూర్ రూ.5 కోట్లు, సైఫ్ అలీ ఖాన్ రూ.10 కోట్లు, ప్రకాష్ రాజ్ రూ.1.5 కోట్లు ఈ సినిమాకి గానూ పారితోషికంగా పుచ్చుకున్నారట. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా భారీగా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. మొత్తంగా.. బడ్జెట్‌లో 26 శాతం వరకూ నటీనటులు, సాంకేతిక నిపుణులకు వెచ్చించినట్లు తెలుస్తోంది.

Devara 20

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘దేవర’ తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి, అంచనాలను అందుకోవడమే కాకుండా, కొత్త రికార్డులను సృష్టించింది. సినిమాలోని ఎన్టీఆర్ అద్భుతమైన నటన, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, కథా కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి.. లాంగ్ రన్ లో ‘దేవర’ ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

ఇవీ చదవండి

English News