HomeMoviesటాలీవుడ్'బిగ్ బాస్-8' కంటెస్టెంట్స్ వీళ్లే..!

‘బిగ్ బాస్-8’ కంటెస్టెంట్స్ వీళ్లే..!

-

తెలుగులో బాగా పాపులరైన రియాలిటీ షో లలో ‘బిగ్ బాస్’ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గడిచిన ఏడు సీజన్లుగా తెలుగులో ‘బిగ్ బాస్’ రియాలిటీ షో సూపర్ డూపర్ హిట్టైంది. దీంతో.. సీజన్-8 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ‘బిగ్ బాస్ 8’కి సంబంధించి అనౌన్స్ మెంట్ ప్రోమోలు విడుదల చేసి ఈ షో పై భారీగా బజ్ పెంచారు నిర్వహకులు. ఇక.. రేపటి నుంచే సైలెంట్ గా ‘బిగ్ బాస్-8’ షురూ అవుతోంది.

‘బిగ్ బాస్’ షో ప్రారంభమవుతోంది? అనగానే రెండు, మూడు వారాల ముందు నుంచే కంటెస్టెంట్స్ వివరాలు బయటకు వస్తుంటాయి. అయితే.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ ను చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అయినా.. రేపటి నుంచి హౌజ్ లో సందడి చేసే వారి పేర్లు బయట ప్రచారమవుతున్నాయి.

ఈసారి కంటెంస్టెంట్స్ గా చాలామంది పేర్లే బయటకు వచ్చాయి. సినిమా, టి.వి. రంగాలకు సంబంధించిన వ్యక్తులతో పాటు.. సోషల్ మీడియా సెలబ్రిటీలు కంటెస్టెంట్స్ లిస్టులో ఉన్నారు. ముందుగా ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ విషయానికొస్తే.. యాంకర్ విష్ణు ప్రియ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. శ్రీముఖి తర్వాత బుల్లితెరపై విష్ణు ప్రియ చేసే సందడి అంతా ఇంతా కాదు. స్మాల్ స్క్రీన్ పై బాగా పాపులరైన విష్ణు ప్రియ ‘బిగ్ బాస్-8’లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీజన్-8 కంటెస్టెంట్స్ లిస్టులో శేఖర్ బాషా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆర్జేగా మంచి పాపులారిటీ తెచ్చుకున్న శేఖర్ బాషా.. ఈమధ్య రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్ లో బాగా పాపులర్ అయ్యాడు. ఒక టి.వి. స్టూడియోలో లావణ్య ఇతనిపై చెప్పుతో దాడి చేసిన సంఘటన ఎక్కువగా అటెన్షన్ తీసుకొచ్చింది.

సీరియల్ యాక్టర్ నిఖిల్ మలియక్కల్ కూడా ఈసారి కంటెస్టెంట్స్ లిస్టులో ఉన్నాడు. ‘గోరింటాకు’ సీరియల్ తో పాపులర్ అయిన నిఖిల్ ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్‌’లో మెరిశాడు. ఈ షో లో నిఖిల్-రీతూ చౌదరి జంట బాగా మురిపించింది. ‘బిగ్ బాస్-8’లో నిఖిల్ తో పాటు.. రీతూ చౌదరి కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. నిఖిల్-రీతూ చౌదరి జంటకు.. ‘బిగ్ బాస్’ హౌజ్ లో మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.

సీనియర్ హీరో ఆదిత్య ఓం కూడా ఈ సారి కంటెస్టెంట్స్ లిస్టులో ఉన్నాడట. ‘లాహిరి లాహిరి లాహిరి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆదిత్య ఓం.. హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తెలుగు వాడు కాకపోయినా.. తెలుగు ప్రేక్షకులతో ఆదిత్య ఓం కి మంచి బాండింగ్ ఉంది.

యూట్యూబర్, డ్యాన్సర్ అయిన నైనిక అనసూరు కూడా ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉందట. ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మోడల్, చిన్న సినిమాల్లో హీరోగా నటించిన అభిరామ్ వర్మ పేరు ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తుంది. ఇతను మిస్టర్ ఆంధ్రప్రదేవ్ గా టైటిల్ గెలిచాడు. ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ ఫేమ్ యాష్మీ గౌడ కూడా ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సీరియల్ లో ముకుంద గా యష్మీకి మంచి పేరొచ్చింది.

ఇంకా.. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన బెజవాడ బేబక్క, కిరాక్ సీత వంటి వారు కూడా ‘బిగ్ బాస్-8’ కంటెస్టెంట్స్ లిస్టులో ఉన్నారట. వీరే కాకుండా.. ఆలీ తమ్ముడు నటుడు ఖయ్యూం, మరో నటుడు అభయ్ నవీన్ నటి, యూట్యూబర్ విష్మయ శ్రీ పేర్లు ‘బిగ్ బాస్-8’ కంటెస్టెంట్స్ లిస్టులో వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. మరికొద్ది గంటల్లోనే ‘బిగ్ బాస్-8’ కంటెస్టెంట్స్ పై ఫుల్ క్లారిటీ రానుంది.

ఇవీ చదవండి

English News