సిద్ధు జొన్నలగడ్డ.. డిజే టిల్లు సినిమాతో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. వయసులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుందీ మూవీ. ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ కు కావాల్సిన బెస్ట్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఆ మేరకు ఇప్పుడు డిజే టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో మరో పార్ట్ తో వస్తున్నాడు.
ఈ సారి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట ప్రోమోనే ఆకట్టుకుంది. అంతకు మించి ఈ పాట కనిపిస్తోంది. డిజే టిల్లు లోని టైటిల్ సాంగ్ లాగా ఇది కూడా అతని క్యారెక్టరైజేషన్ ను తెలియజేసే పాటలా ఉంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ గీతాన్ని సంగీత దర్శకుడు కూడా అయిన రామ్ మిర్యాల మరోసారి ఫంకీగా పాడేశాడు. ట్యూన్ సైతం చాలా చాలా క్యాచీగా ఉంది.
“టిక్కెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా.. సిట్టి నీది సిరుగుతుందేమో సూడర బుల్లోడా.. మూసుకోని కూసోకుండా గాలం వేశావు పబ్బుకాడ.. సొర్ర శాప తగులుతుంది తీరింది కదరా.. ” అంటూ మొదలైన ఈ పాట ఆద్యంతం అతని పాత్రను తెలియజేసే సాహిత్యంతో అలరిస్తుంది. మరోసారి అమ్మాయిని పటాయించిన టిల్లు అన్న గురించి అతని ఫ్రెండ్స్ పాడుతున్నట్టుగా ఉంది. ” టిల్లుగాడు కిరాక్ ఈడు.. మందులోకి పల్లిలాగా లొల్లి లేకుండా ఉండలేడు.. తొందరెక్కువమ్మా తెల్లారకుండానే కూసేత్తాడు.. ప్రేమిస్తడు, పడిచస్తడు.. ప్రాణం ఇమ్మంటే ఇచ్చేస్తడు.. టిల్లు అన్న ఇలాగైతే ఎలాగన్నా.. స్టోరీ మళ్లీ రిపీటేనా.. పోరీ దెబ్బకు మళ్లీ నువ్వు తానా తందానా.. ” అనే ఫస్ట్ చరణం ఆకట్టుకుంది. అంతకు మించి రెండో చరణం కూడా ఉంది.
ఇక ఈ పాట చూస్తుంటే అనుపమ పరమేశ్వర్ ఫస్ట్ పార్ట్ లో నేహాశెట్టి రేంజ్ గ్లామర్ ను కురిపించింది అని అర్థం అవుతోంది. రౌడీబాయ్ తర్వాత మరోసారి లిప్ లాక్ కూడా చేసినట్టుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కథ, స్క్రీన్ ప్లే ఎప్పట్లానే సిద్ధునే అందించాడు. ఈ మూవీని సెప్టెంబర్ లో విడుదల చేసే అవకాశాలున్నాయి.