తెలంగాణ వ్యాప్తంగా పది రోజులు థియేటర్లు మూసివేత

తెలుగు చిత్ర పరిశ్రమకు అతిపెద్ద సీజన్ అంటే సమ్మర్ అని చెప్పాలి. సంక్రాంతి వంటి పండగలు కేవలం ఐదారు రోజులు ఉంటే.. వేసవిలో మాత్రం ఏకంగా 45 రోజుల సమయం చిక్కుతుంది. అందుకే.. వేసవి బరిలో సినిమాలను విడుదల అగ్ర కథానాయకులు సైతం పోటీ పడుతుంటారు. కానీ.. ఈ ఏడాది వేసవి భిన్నంగా సాగుతోంది. ఒకవైపు పెద్ద సినిమాలు లేవు. మరోవైపు.. ఎన్నికల వాతావరణం, ఐ.పి.ఎల్. వంటి వాటితో ఈ సమ్మర్ దాదాపు గా ఖాళీగానే సాగిపోయింది.

ఇంక.. మిగిలిన ఈ వేసవిలోని 15 రోజుల్లో క్రేజున్న సినిమా ఒకటీ రావడం లేదు. దీంతో.. ఈ శుక్రవారం నుండి పది రోజుల పాటు తెలంగాణ లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూత పడనున్నాయి. క్రేజున్న సినిమాలు లేకపోవడంతో థియేటర్లకు జనం వచ్చే పరిస్థితి లేదు. ఈనేపథ్యంలో.. థియేటర్లు నడపడం భారం అవుతుందనే ఉద్దేశ్యంతో తెలంగాణ వ్యాప్తంగా థియేటర్ యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Related Posts