HomeMoviesటాలీవుడ్అక్కినేని గూటికి చేరిన 'గూఢచారి' జంట

అక్కినేని గూటికి చేరిన ‘గూఢచారి’ జంట

-

అక్కినేని వారి ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నాగచైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. నిశ్చితార్థం కూడా పూర్తి చేశాడు కింగ్ నాగార్జున. ఆ విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ‘నా తనయుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా’ అని నాగార్జున తెలిపారు.

శోభిత దూళిపాళ ఇప్పటివరకూ నాగచైతన్యతో నటించలేదు. అచ్చమైన తెలుగు అమ్మాయి అయినా.. ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేసింది. ఇక శోభిత తెలుగు పరిశ్రమకు పరిచయమైంది ‘గూఢచారి’ చిత్రంతో. ఈ సినిమాలో అడవి శేష్, శోభిత హీరోహీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో ‘మేజర్’ మూవీ వచ్చింది. ఇక.. ఇప్పటికే ‘గూఢచారి’ అయిన అడవి శేష్.. అక్కినేని వారి మనవరాలు సుప్రియతో పెళ్లి పీటలెక్కబోతున్నాడనే ప్రచారం ఉంది. దానికంటే ముందే ఇప్పుడు ‘గూఢచారి’ బ్యూటీ శోభిత.. నాగచైతన్య తో ఏడడుగులు నడవబోతుందన్న మాట.

ఇవీ చదవండి

English News