పాట బలే ఉంది విరూపాక్షా

ఏ విషయంలో అయినా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ముఖ్యంగా సినిమాలకు ఈ మాట చాలా ఇంపార్టెంట్. అది టైటిల్ కావొచ్చు.. ఫస్ట్ లుక్, టీజర్, పాట.. ఇలా ఏదైనా కావొచ్చు.. మొదటగా వచ్చిన ప్రతిదీ మెప్పిస్తే సినిమాపై అంచనాలు పెరుగుతాయి. ఆ అంచనాలు ఓపెనింగ్స్ తెస్తాయి. కంటెంట్ కూడా మెప్పిస్తే కలెక్షన్స్ వస్తాయి. ఈ విషయంలో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష మూవీ ఇప్పటి వరకూ వచ్చిన అన్ని అంశాల్లోనూ.. ఆకట్టుకుంటోంది. ముందు ఈ టైటిల్ తో పాటు విడుదల చేసిన వీడియో.. అటుపై టీజర్, మేకింగ్ ఇలా ప్రతిదీ పర్ఫెక్ట్ గా కట్ చేశారు. అన్నీ ఇంప్రెసివ్ గానే అనిపించాయి. పైగా టీజర్ చూసిన తర్వాత ఇప్పుడు కంట్రీ ఉన్న మూడ్ కు తగ్గ కంటెంట్ కూడా ఉందనిపిస్తోంది. అందుకే విరూపాక్షపై ఆల్రెడీ అంచనాలు మొదలయ్యాయి. ఇక లేటెస్ట్ గా విడుదలైన పాట.. వెరీ బ్యూటీఫుల్ మెలోడీగా వినిపిస్తోంది.

First lyrical song released from sai dharamtej's Virupaksha...Saidharam Tej starrer Virupaksha movie is impressive in all aspects


విరూపాక్ష నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. కన్నడలో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్న బి అజనీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడు. ఇక కొత్తగా విడుదల చేసిన ఈ పాట మాంటేజ్ సాంగ్ లా కనిపిస్తోంది. ‘‘నచ్చావులే నచ్చావులే.. ఏ రోజూ చూశానో.. ఆ రోజే.. నచ్చావులే నచ్చావులే.. నీ కొంటె వేశాలే చూశాకే.. తడబడని తీరు నీదే తెగబడుతు దూకుతావే.. ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే.. బెదురు మరి లేదా అనుకుందే నువ్ చేస్తావే.. ’’ అంటూ కృష్ణకాంత్ రాసిన సాహిత్యానికి సూథింగ్ ట్యూన్స్ తో మెప్పించాడు అజనీష్.ఈ ట్యూన్స్ అంతకంటే అందంగా ఆలపించాడు సింగర్ కార్తీక్. ఓ మారుమూ గ్రామంలో ఉండే హీరోయిన్ ను చూసి ప్రేమలో పడిన కుర్రాడి ఊహకు అక్షర రూపంలా కనిపిస్తోందీ పాట. సాహిత్యం చాలా బావుంది. వినగానే ఆకట్టుకునేలా ట్యూన్ ఉంది. దీంతో పాటల సెంటిమెంట్ ను కూడా ఈ చిత్రం దాటేసినట్టే అనుకోవచ్చు. అంటే ఫస్ట్ సాంగ్ బావుంటే మిగతా పాటలు ఆటో మేటిక్ గా కనెక్ట్ అవుతాయి కదా..? ఏదేమైనా ఈ మధ్య కాలంలో వచ్చిన బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ లా ఉందీ విరూపాక్ష పాట. ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కాబోతోంది. మరి కంటెంట్ కూడా బావుంటే సాయిధరమ్ తేజ్ కు ఓ హిట్ గ్యారెంటీ అనుకోవచ్చు.

Related Posts