‘వీరమల్లు‘ షూటింగ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిచేయాల్సిన సినిమాలు మూడున్నాయి. వీటిలో హిస్టారికల్ డ్రామా ‘హరిహర వీరమల్లు‘ ఒకటి. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు.

తొలుత దర్శకుడు క్రిష్ కొంతభాగాన్ని తెరకెక్కించిన ఈ సినిమాని ఇప్పుడు ఎ.ఎమ్.రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తిచేస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ‘హరిహర వీరమల్లు‘ ఫస్ట్ పార్ట్ ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ను ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు.

ఈ జూలై నుంచే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు‘ సెట్స్ లో పాల్గొనబోతున్నాడనే ప్రచారం ఈమధ్య జరిగింది. అయితే.. అది కేవలం రూమర్ మాత్రమేనని కొట్టిపారేశారు నిర్మాత ఎ.ఎమ్.రత్నం. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ తో ఉన్న పవన్ కళ్యాణ్.. త్వరలోనే ‘వీరమల్లు‘ సెట్స్ లోకి అడుగుపెడతారన్నారు. అలాగే.. ఆయన నటించాల్సిన సన్నివేశాలు కూడా తక్కువగానే ఉన్నాయని.. వీలైనంత త్వరగా ‘వీరమల్లు‘ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని రత్నం తెలిపారు.

Related Posts