‘దేవర’ పాటకు నాగవంశీ ఎలివేషన్ మామూలుగా లేదు

తమిళనాట వరుస విజయాలతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నాడు అనిరుధ్ రవిచందర్. ఇక.. హీరో ఎలివేషన్ సాంగ్స్ చేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్నాడు అనిరుధ్. ‘విక్రమ్, జైలర్’ వంటి చిత్రాల్లోని పాటలు వింటే ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుని తీరుతారు. ఇక.. ఈ సెన్సేషనల్ రాక్‌స్టార్ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’కి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ‘దేవర’ పాటలను అనుకున్న సమయానికి అందించలేదన్న పుకార్లు వినిపించినా.. ఆలస్యమైన అద్భుతమైన ట్యూన్స్ అందించాడనే ప్రశంసలు అందుకుంటున్నాడు అనిరుధ్.

ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్ గా మే 19న ‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఫియర్’ రిలీజవుతోంది. ఈ పాట ఇప్పటికే విన్న సితార అధినేత నాగవంశీ ‘దేవర’ పాటపై ప్రశంసల వర్షం కురపిస్తున్నారు. ‘దేవర’లోని ఫియర్ సాంగ్ విన్న వారెవరైనా.. అనిరుధ్ అంతకు ముందు కంపోజ్ చేసిన ‘హుకుమ్’ పాటను మర్చిపోతారు అని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు నాగవంశీ. ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Posts