ఆ సినిమా తెలుగులో డబ్ అవుతోంది

డాడా.. ఈ యేడాది ఆరంభంలో తమిళ్ లో వచ్చిన సినిమా. కెవిన్, అపర్ణాదాస జంటగా నటించారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి మౌత్ టాక్ ద్వారా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. యూత్ ఫుల్ హార్ట్ మెల్టింగ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకులే ఎక్కువగా ప్రచారం చేయడం విశేషం. చాలా సింపుల్ స్టోరీ. బట్ ఎఫెక్టివ్ గా చెప్పాడు దర్శకుడు గణేష్ కే బాబు.

ఓ కాలేజ్ గోయింగ్ కపుల్. ప్రేమించుకుంటారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే చదువులు పూర్తి కాకుండా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఆ కుర్రాడు.. చిన్న జాబ్ చూసుకుంటాడు. పనిలో అసంంతృప్తి. ఇటు భార్య ప్రేమ. రెండిటి మధ్య ఇబ్బంది పడుతూ.. ఆమెకు తను చేసిన ఓ ప్రామిస్ ను వదిలేస్తాడు. ఆ టైమ్ లో ఆమె ప్రెగ్నెంట్. నిండు చూలాలుగా ఉండి నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు.

ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తుంది తను. ఆ బిడ్డను వదిలేసి వెళ్లిపోతుంది. తర్వాత విషయం తెలుసుకున్న హీరో.. ఆసుపత్రికి వెళితే ఆమె ఉండదు. పుట్టిన బిడ్డను మాత్రం ఇస్తారు. ఆ బిడ్డను ఇతను కూడా వదిలేసే ప్రయత్నం చేసి మనసొప్పక మళ్లీ తెచ్చుకుని ఒంటరిగా పెంచుతాడు. ఎంతలా అంటే.. ఆ బాబు పెరుగుతున్నా కొద్దీ ఒక్కసారి కూడా అమ్మా అనే మాట కూడా అవసరం లేనంత ప్రేమగా పెంచుతాడు. మరి ఈ భార్య భర్త, తల్లీ కొడుకు కలుస్తారా.. కలిస్తే ఎలా అనేది కథ.


ఈ కథను చాలా మెచ్యూర్డ్ గా చెప్పాడు దర్శకుడు. టీనేజ్ పెళ్లిళ్లు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే మెసేజ్ కూడా ఉంటుంది. మొత్తంగా ఈ సినిమా క్లైమాక్స్ హృదయాలను పిండేస్తుంది. ఒక మంచి కుటుంబ కథా చిత్రం చూసిన ఫీలింగ్ ఇస్తుంది. విశేషం ఏంటంటే.. ఈ కథలో లస్ట్ కు చోటుండదు. టీనేజ్ లవ్ స్టోరీ కాబట్టి ఆ సీన్స్ పెట్టొచ్చు. బట్ ఎక్కడా స్కిన్ షో కూడా లేకుండా తెరకెక్కించాడు.


ఈ మూవీతో హీరో కెవిన్ కు మంచి బ్రేక్ వచ్చింది. అపర్ణా దాస్ బిజీ అయింది. ప్రస్తుతం తెలుగులో వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న ఆదికేశవ్ లో కూడా ఈ అపర్ణాదాస్ నటిస్తోంది. మొత్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో ” పా పా ” అనే పేరుతో విడుదల చేస్తున్నారు. మరి తెలుగులో ఎలాంటి అప్లాజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

Related Posts