ప్రస్తుతం తమిళనాట విజయ్ క్రేజ్ ముందు ఏ కథానాయకుడు నిలబడే అవకాశం లేదనేది ట్రేడ్ వర్గాల టాక్. విజయ్ సినిమాలు బిజినెస్ పరంగా వందల కోట్లు కొల్లగొడుతుంటాయి. విజయం, అపజయాలతో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తుంటాయి. పారితోషికం పరంగానూ విజయ్.. తమిళనాట అగ్రపథాన దూసుకుపోతున్నాడు. త్వరలో పూర్తిస్థాయి రాజకీయాలతో బిజీ కాబోతున్న దళపతి విజయ్ నుంచి వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ది గోట్‘. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‘ అనేది ఈ మూవీకి ఫుల్ ఫామ్.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ది గోట్‘ నుంచి ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, మూడు పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో విజయ్ గాంధీ అనే పాత్రలో రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. గాంధీ పాత్రలో తండ్రిగా.. కొడుకు గానూ విజయ్ విజయ్ ద్విపాత్రాభినయంతోనూ మురిపించనున్నాడు. విజయ్ మార్క్ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో సీనియర్ హీరోలు ప్రభుదేవా, ప్రశాంత్, జయరామ్.. సీనియర్ హీరోయిన్లు లైలా, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మీనాక్షి చౌదరి మరో ఇంపార్టెంట్ రోల్ లో అలరించనుంది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘ది గోట్’ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.