‘జిన్నా’ చిత్రం ఢీ కంటే 10 రెట్లు ఎక్కువ

విష్ణు మంచు టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘జిన్నా’. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు.పాయ‌ల్ రాజ్‌పుత్‌, స‌న్నీలియోన్ హీరోయిన్స్‌. దీపావళి సందర్భంగా జిన్నా మూవీని అక్టోబర్ 21న వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది. క‌లెక్ష‌న్ కింగ్, న‌ట ప్ర‌పూర్ణ డాక్ట‌ర్ మంచు మోహ‌న్ బాబు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా..క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహన్ బాబు (Mohan Babu) మాట్లాడుతూ ‘‘అభిమానులంద‌రికీ, ప్రేక్ష‌కుల‌కు నా హృద‌య పూర్వ‌క‌ ధ‌న్య‌వాదాలు. 560కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశాను. 75 సినిమాల‌ను నిర్మించాను. శివాజీగారి ఫంక్ష‌న్స్‌లో, మా అన్న‌య్య ఎన్టీఆర్‌గారి ఫంక్ష‌న్‌లో , నాగేశ్వ‌శ్వ‌ర రావుగారి ఫంక్ష‌న్‌లో కృష్ణ‌గారు, కృష్ణంరాజుగారు ఫంక్ష‌న్స్‌లో.. అబ్దుల్ క‌లామ్ మా ఇన్‌స్టిట్యూట్‌కి వ‌చ్చిన‌ప్పుడు ఆ ఫంక్ష‌న్‌లో కానీ.. ఎవ‌రూ న‌న్నెప్పుడూ ఇన్ని నిమిషాలు మాట్లాడాల‌ని చెప్ప‌లేదు. విష్ణు బాబు మాత్రం ఈరోజు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి నాన్న ఈరోజు మీరు త‌క్కువ‌గా మాట్లాడాలి. 50 సంవ‌త్స‌రాల న‌ట జీవితం నాది. ఎక్కువ‌గా మాట్లాడుతుంటానా, పెద్ద‌వాళ్లు చెప్ప‌లేదే అనిపించింది. అప్ప‌టి రోజులు వేరు, ఇప్ప‌టి రోజులు వేరు (న‌వ్వుతూ..). హ‌నుమంతుడు సీత ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు ఏం చెప్పాడు. రావ‌ణాసురుడు ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు ఏం చెప్పాడ‌నేది ఎన్నో సంద‌ర్భాల్లో చెప్పాను. అలాగే మ‌న గురించి మ‌నం చెప్ప�