తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి చల్లారింది. జూన్ 4న రిజల్ట్స్ వచ్చే వరకూ ఫలితాలపై టెన్షన్ కొనసాగుతోంది. కానీ.. ఈలోపులో టాలీవుడ్ స్టార్స్ నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ సినిమాలకు సంబంధించిన పనులను కూడా చక్కబెట్టనున్నారట.
ముందుగా బాలకృష్ణ విషయానికొస్తే.. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు నటసింహం. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే ఊపులో ఇప్పుడు బాబీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఎన్నికల కోసం బాబీ సినిమా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన బాలయ్య.. జూన్ నుంచి మళ్లీ ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నాడు. జూన్ లో బాలకృష్ణ బర్త్ డే స్పెషల్ గా ఈ చిత్రం నుంచి పాట లేదా టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే కొత్త సినిమాకి కూడా త్వరలోనే శ్రీకారం చుట్టనున్నాడట బాలయ్య.
బాలకృష్ణ తర్వాత ఎన్నికల వాతావరణం నుంచి కాస్త రిలాక్స్ అయిన మరో స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ కిట్టీలో ‘హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలున్నాయి. వీటిలో ‘హరిహర వీరమల్లు, ఓజీ’ సినిమాలు ఈ ఏడాదే విడుదల తేదీలు ఖరారు చేసుకున్నాయి. దీంతో.. ముందుగా ఈ రెండు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నాడట పవన్. ఆ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో బిజీ అవుతాడు.
ఏదేమైనా.. జూన్ 4 తర్వాతే పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది.