హార్ట్ ఎటాక్ తో మరణించిన ‘ధూమ్’ డైరెక్టర్

బాలీవుడ్ లో ‘ధూమ్, ధూమ్ 2’ చిత్రాలతో పాపులర్ అయిన డైరెక్టర్ సంజయ్ గాధ్వీ హార్ట్ ఎటాక్ తో మరణించారు. ఈరోజు ఉదయం మార్నింగ్ వాక్ కి వెళ్లినప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చిందట. వెంటనే అతన్ని ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు తెలిపారు.

సంజయ్ గాధ్వీ వయసు 57 సంవత్సరాలు. 2001లో ‘తేరే లియే’ సినిమాతో బాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘మేరే యార్ కీ షాదీ హై’ సినిమా చేశాడు. అయితే.. సంజయ్ గాధ్వీకి దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చిన చిత్రాలు ‘ధూమ్, ధూమ్ 2’. యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా బాలీవుడ్ లో ‘ధూమ్’ సినిమాలు ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాయి.

Related Posts