HomeMoviesటాలీవుడ్‘విశ్వంభర‘ సెట్స్ లో సందడి చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి

‘విశ్వంభర‘ సెట్స్ లో సందడి చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి

-

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర‘ మూవీ సెట్స్ లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న కందుల దుర్గేష్ సందడి చేశారు. ‘విశ్వంభర‘ సెట్స్ లో చిరంజీవి.. మంత్రి కందుల దుర్గేష్ కి సాదరంగా ఆహ్వానం పలికి.. పుష్పగుచ్చం ఇచ్చి.. శాలువ కప్పి
స్వాగతం పలికిన ఫోటోలను మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉందని.. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు‘ అంటూ తన పోస్ట్ లో తెలిపారు చిరంజీవి.

ఈ సందర్భంగా చిరు పోస్ట్ చేసిన ఫోటోలలో ‘విశ్వంభర‘ నిర్మాత విక్కీ, దర్శకుడు వశిష్ట, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు కూడా సందడి చేస్తున్నారు.

ఇవీ చదవండి

English News