“దోస్తాన్” చిత్రం టీజర్ విడుదల

శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ ,ఆర్ కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోస్తాన్ “. విడుదలకు  సిద్దమైన చిత్ర టీజర్ ను ఘనంగా  విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు చిత్ర  టీజర్ లాంచ్ చేశారు. వీరితో పాటు నిర్మాత పద్మిని నాగులపల్లి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, మూసా అలీ ఖాన్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా..ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు మాట్లాడుతూ.. తరతరాలనుండి వస్తున్నదే ఫ్రెండ్ షిప్. ఇప్పుడు “దోస్తాన్’ పేరుతో వస్తున్న ఈ చిత్ర టీజర్ బాగుంది.మంచి కథను  సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించిన దర్శక,నిర్మాత సూర్యనారాయణకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. అలాగే ఈ సినిమాకు పని చేసిన టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుతూ ఆల్ ద  బెస్ట్ తెలిపారు.

నిర్మాత  తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, మాట్లాడుతూ.. కదిరిలో ఉన్న సూర్యనారాయణ గారు అన్నవరం లో ఉన్న హీరోతో వైజాగ్, రాజమండ్రి లలో విజయవంతంగా షూటింగ్ చేసుకొని “దోస్తాన్” అని మంచి టైటిల్ పెట్టారు.ఆర్టిస్ట్ ల పెర్ఫార్మన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ట్రైలర్, టీజర్  ఇలా అన్నీ బాగున్నాయి.మంచి కథతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం  సాదించాలి అన్నారు.మూసా అలీ ఖాన్ మాట్లాడుతూ.. మంచి ప్లానింగ్ తో  ఫ్రెండ్స్ టైటిల్ తో తీసిన “దోస్తాన్” సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.నిర్మాత పద్మిని నాగులపల్లి మాట్లాడు తూ.. ఫ్రెండ్స్ కాన్సెప్ట్ తో