HomeMoviesటాలీవుడ్‘ఆయ్‘ టీమ్ ను అభినందించిన తారక్

‘ఆయ్‘ టీమ్ ను అభినందించిన తారక్

-

పంద్రాగస్టున పోరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలలో ‘ఆయ్‘ సినిమా ఒకటి. గీతా ఆర్ట్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి వచ్చిన ఈ సినిమాకి తొలి రోజు నుంచే హిట్ టాక్ వచ్చింది. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఈ సినిమాని అంజి కె.మణిపుత్ర తెరకెక్కించాడు. ఆద్యంతం గోదావరి జిల్లాల నేపథ్యంలో.. అచ్చమైన పల్లెటూరి కథాంశంగా వచ్చిన ‘ఆయ్‘ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.

‘ఆయ్‘ సినిమా విడుదలకు ముందే.. ప్రచార సభలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ పాల్గొంటారనే ప్రచారం జరిగింది. అయితే.. వాళ్లు వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండడంతో అది సాధ్యపడలేదు. ‘ఆయ్‘ సినిమాకి సోషల్ మీడియా వేదికగా తారక్, బన్నీ లు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక.. మూవీ రిలీజైన తర్వాత ‘ఆయ్‘ మూవీని ప్రత్యేకంగా అభినందించాడు ఎన్టీఆర్. అందుకు సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ.

ఇవీ చదవండి

English News