కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు మాస్ మహారాజ రవితేజ. ఈకోవలోనే తొలినాళ్లలో రవితేజ సినిమాలతో బాగా పాపులర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్. రవితేజ నటించిన ‘కిక్, ఆంజనేయులు, మిరపకాయ్’ వంటి సినిమాలే తమన్ ని తారాపథంలో నిలబెట్టాయి. అలా మొదలైన వీరి కాంబోలో ఇప్పటివరకూ 11 సినిమాలొచ్చాయంటే ఆశ్చర్యం కలగక మానదు.

అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం రవితేజ-మలినేని గోపీచంద్ సినిమాతో 12వ సారి మాస్ మహారాజాకి మ్యూజిక్ అందించబోతున్నాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు తమన్. కేవలం రవితేజాతో మాత్రమే కాదు.. డైరెక్టర్ మలినేని గోపీచంద్ తోనూ తమన్ ది ఓ అరుదైన రికార్డే అని చెప్పాలి.

మలినేని ఫస్ట్ మూవీ ‘డాన్ శీను’ పక్కనపెడితే.. ఆ తర్వాత ‘బాడీగార్డ్ నుంచి వీరసింహారెడ్డి’ వరకూ అన్ని చిత్రాలకు తమనే సంగీతాన్ని సమకూర్చాడు. ఆవిధంగా ఇప్పుడు మలినేనితో తమన్ కి 7వ సినిమా కాబోతుంది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ తోనూ నాల్గవ సూపర్ సక్సెస్ ఫుల్ మూవీ చేయబోతున్నానంటూ RT4GM సినిమాలో పనిచేయడం గురించి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.