HomeMoviesటాలీవుడ్‘ఓజీ‘ గురించి క్రేజీ అప్డేట్స్ ఇచ్చిన తమన్

‘ఓజీ‘ గురించి క్రేజీ అప్డేట్స్ ఇచ్చిన తమన్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న సినిమాలలో ‘ఓజీ‘ ఒకటి. ‘సాహో‘ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతుంది. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ‘వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో‘ చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్ తో తమన్ చేస్తున్న మూవీ ఇది.

ఈరోజు తన బర్త్ డే స్పెషల్ గా ‘ఓజీ‘ గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు తమన్. ‘ఓజీ‘ మూవీలో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ నటించబోతున్నాడని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ మూవీలో అకిరా యాక్టింగ్ డెబ్యూ గురించి పక్కన పెడితే సంగీత పరంగా పవన్ వారసుడి ప్రమేయం ‘ఓజీ‘లో ఉండబోతుందని క్లారిటీ ఇచ్చాడు తమన్.

పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్‌ను ఈ సినిమాలో పియానిస్ట్‌గా పరిచయం చేయాలని తమన్ ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. అకీరా పియానో అద్భుతంగా వాయిస్తాడని.. తన దగ్గర కొన్ని రోజులు పనిచేశాడని తమన్ తెలిపాడు.

మరోవైపు.. ‘ఓజీ‘ కోసం పవన్ కళ్యాణ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల కూడా రంగంలోకి దిగనున్నాడట. ఇటీవల వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం‘ కోసం ఓ పాట పాడాడు రమణ గోగుల. ఇప్పుడు ‘ఓజీ‘లోనూ రమణ గోగులతో ఓ పాట పాడించబోతున్నాడట తమన్. గతంలో పవన్ తో రమణ గోగుల చేసిన ‘తమ్ముడు, బద్రి‘ మ్యూజికల్ అప్పటి కుర్రకారును ఓ ఊపు ఊపేశాయి.

ఇవీ చదవండి

English News