మరోసారి హాలీవుడ్ కి వెళుతున్న టబు

రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచిన హైదరాబాదీ బ్యూటీ టబు. మూడు దశాబ్దాల క్రితం వెంకటేష్ ‘కూలీ నంబర్ 1′ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన టబు.. ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. వయసుతో నిమిత్తం లేకుండా అప్పటి నుంచి ఇప్పటివరకూ వరుస సినిమాలతో బిజీగా సాగుతూనే ఉంది ఈ బ్యూటీ.

ఇండియన్ లాంగ్వేజెస్ లో మాత్రమే కాదు.. అడపాదడపా హాలీవుడ్ లోనూ సందడి చేస్తుంటుంది టబు. మొదటగా మీరా నాయర్ తీసిన ‘నేమ్ సేక్’తో ఇంటర్నేషనల్ సర్కిల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది టబు. అయితే.. ‘లైఫ్ ఆఫ్ పై’ టబుకి హాలీవుడ్ లో మంచి పేరు తీసుకొచ్చింది. తాజాగా.. మరోసారి హాలీవుడ్ ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధమైంది. హాలీవుడ్ లోని పాపులర్ ‘డ్యూన్‘ సిరీస్ లో రాబోతున్న ‘డ్యూన్.. ప్రాఫెసీ’లో టబు నటించబోతుంది.‘డ్యూన్.. ప్రాఫెసీలో సిస్టర్ ఫ్రాన్సెస్కా పాత్రలో టబు నటించనుందట. త్వరలోనే.. ఈ సిరీస్ లోని టబు రోల్ పై ఫుల్ క్లారిటీ రానుందట.

Related Posts