Manchu vishnu : కరాటే కళ్యాణిపై సస్పెన్షన్.. రైటా.. రాంగా..?

కెరీర్ ఆరంభంలోనే బి గ్రేడ్ తరహా పాత్రల్లో కనిపించిన నటి కరాటే కళ్యాణి. అప్పట్లో క్లీవేజ్ షోస్ తో కొంత పాపులారిటీ తెచ్చుకుంది. తర్వాత కృష్ణ, మిరపకాయ్ చిత్రాల్లో చేసిన పాత్రలతో కాస్త ఫేమ్ అయింది. మామూలుగా భాగవత కళాకారిణి అయిన కళ్యాణి.. ఆ ఇమేజ్ కు భిన్నమైన పాత్రలు వెండితెరపై పోషించింది. అయితే కొన్నాళ్లుగా ఈవిడి అన్ని వివాదాల్లోనూ హెడ్ పెట్టేస్తోంది. అవసరం ఉన్నా లేకపోయినా.. అన్నిట్లోకీ దూరిపోతోంది. దానికి కాస్త మసాలా దట్టించి మతం రంగు కూడా పూసేసి ఒక వర్గం అభిమానం కోసం ప్రయత్నాలు చేసింది.

అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా .. కళ్యాణి మతం ముసుగు కూడా స్వార్థమే అని తర్వాత చాలామందికి అర్థమైంది. మరోవైపు సినిమాలు కూడా తగ్గడంతో ఇదే వ్యాపకంగా నిత్యం వివాదాలతో కనిపిస్తోంది. ఇక తాజాగా ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించిన రగడ మొదలుపెట్టింది. ఖమ్మంలోని లకారం పార్క్ వద్ద 56 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకున్నారు.

అయితే ఈ విగ్రహం శ్రీ కృష్ణుడిది. దీంతో ఒక నటుడుని దేవుడు బొమ్మగా ఎలా ఆవిష్కరిస్తారు.. ఇది మా “యాదవుల”ను అవమానించడ