వెర్సటైల్ యాక్టర్ సూర్య సినిమా అంటే దేశవ్యాప్తంగా ఆదరణ ఉంటుంది. గజినీతో తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకుని ఇక్కడా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించాడు. సూర్య సినిమాకు తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది.తమిళ్ తో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం కంగువా అనే భారీ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్న సూర్య లేటెస్ట్ గా మరో బిగ్ బడ్జెట్ మూవీకి సైన్ చేశాడు.
ఈ సారి హిందీలో రూపొందబోతోందీ సినిమా. యస్.. సూర్య కూడా బాలీవుడ్ కు వెళుతున్నాడు. అదీ బాలీవుడ్ డైరెక్టర్ తోనే. హిందీలో రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్, ఢిల్లీ6 వంటి అవుట్ స్టాండింగ్ మూవీస్ తో ఆకట్టుకున్న ఓమ్ ప్రకాష్ మెహ్రా సూర్యను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి “కర్ణ”అనే టైటిల్ ఆల్రెడీ ఫిక్స్ చేశారు.
టైటిల్ చూసి ఇది మైథాలజీ అనుకుంటున్నారు చాలామంది.ఆ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఓమ్ ప్రకాష్ శైలి తెలిసిన వాళ్లు మాత్రం భారతంలోని కర్ణుడి పాత్రను సోషలైజ్ చేస్తున్నాడు అంటున్నారు. ఇలా సౌత్ లో కర్ణుడు ఇన్సిస్పిరేషన్ గా చాలా సినిమాలే వచ్చాయి. బట్ బాలీవుడ్ లో అంతగా కనిపించవు. అందుకే ఇది అక్కడ ఫస్ట్ టైమ్ అనుకోవచ్చు. ఇక 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొంచబోతున్నారు అనేది మరో టాక్.
కర్ణుడి పాత్రను సోషలైజ్ చేస్తే అంత బడ్జెట్ ఎందుకు అవుతుంది.. ఇది ఖచ్చితంగా మహా భారత కథే అంటున్నారు చాలామంది. అదీ నిజమే కావొచ్చు. ఎదుకంటే ఈ మూవీలో దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ ఆర్టిస్టులందరినీ తీసుకుంటారట. అలాగే టెక్నీషియన్స్ ను కూడా అన్ని భాషల నుంచీ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. సో.. చాలామంది మహా భారత కథ గురించి ఆలోచిస్తుంటే ఓమ్ ప్రకాష్ ఏకంగా పని ప్రారంభించేశాడన్నమాట.మరి ఈ మూవీకి పోటీగా ఇంకేవైనా మహాభారత కథలు వస్తాయా లేదా అనేది చూడాలి.