సూపర్ స్పీడులో సూపర్‌స్టార్ రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ జెట్ స్పీడులో తన సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ‘జైలర్’తో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసిన ఈ వెటరన్ హీరో.. ప్రస్తుతం ‘వెట్టైయాన్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘జై భీమ్’ వంటి అత్యద్భుతమైన చిత్రాన్నందించిన టి.జె.ఙ్ఞాన్‌వేల్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి, మాలీవుడ్ నుంచి ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ వంటి తారాగణం నటిస్తుంది.

లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి లేటెస్ట్ గా రజనీకాంత్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. అక్టోబర్ లో ఈ సినిమాని విడుదలకు ముస్తాబు చేస్తున్నారు. ఇక.. ఏడు పదుల వయసు దాటినా.. కుర్ర హీరోలకు మించిన రీతిలో రజనీకాంత్ వరుస సినిమాలతో దూకుడు పెంచుతున్నాడు. ప్రస్తుతం ‘వెట్టైయాన్’ నుంచి ఫ్రీ అయిన సూపర్ స్టార్.. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమాతో బిజీ కానున్నాడు.

Related Posts