హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉండే కథానాయకుడు నారా రోహిత్. మంచి వాయిస్ పవర్ ను సొంతం చేసుకున్న రోహిత్.. తొలి చిత్రం ‘బాణం’ నుంచి వైవిధ్యభరిత కథాంశాలపై ప్రత్యేక దృష్టిపెడుతూ వచ్చాడు. ఆరేళ్ల పాటు సినిమాల నుంచి విరామం తీసుకుని ఈ ఏడాది ‘ప్రతినిధి 2’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రోహిత్. ఇప్పుడు పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం ‘సుందరకాండ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
‘నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ది సేమ్’ అంటూ వెంకటేష్ నిమ్మలపూడి ‘సుందరకాండ‘ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విర్తీ వఘాని హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీదేవి విజయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈరోజు ‘సుందరకాండ‘ సినిమా టీజర్ ను విడుదల చేసింది టీమ్. కంప్లీట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో పెళ్లికాని ప్రసాద్ టైప్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు నారా రోహిత్. తనకు నచ్చిన ఐదు క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం వెతికే అబ్బాయిగా నారా రోహిత్ పాత్ర కనిపిస్తుంది. సీనియర్ నరేష్, వాసుకి ఆనంద్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.