మాస్ మహారాజా రవితేజ తన ల్యాండ్‌మార్క్ 75వ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ‘సామజవరగమణ’ రైటర్ భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజాతో ‘ఈగల్’ సినిమాని తెరకెక్కించిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా.. ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందిస్తున్నాడు.
లేటెస్ట్ గా రవితేజ-75వ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మాస్ మహారాజకి జోడీగా శ్రీలీల నటించనుందట. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ధమాకా’ సూపర్ డూపర్ హిట్టయ్యింది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు వసూళ్లు సాధించిన ‘ధమాకా’కి శ్రీలీల డ్యాన్సులు ఎంతో ప్లస్ అయ్యాయి. వచ్చే సంక్రాంతి కానుకగా రవితేజ-75 విడుదలకు ముస్తాబవుతోంది.