శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. లంగ్స్ ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఆయన కన్నుమూశారు. శిరీష్ భరద్వాజ్ వయసు 39 సంవత్సరాలు. 2007వ సంవత్సరంలో శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. శ్రీజ ఇంట్లో తెలియకుండా పారిపోయి చేసుకున్న ఈ వివాహం.. అప్పట్లో పెను సంచలనమైంది.

శ్రీజ, శిరీష్ లకు ఒక పాప జన్మించింది. అయితే.. 2012లో శిరీష్ తనను అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

2014లో శ్రీజ, శిరీష్ భరద్వాజ్ లకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత కొన్నేళ్లకు శ్రీజ.. కళ్యాణ్ దేవ్ ను రెండో వివాహం చేసుకోగా, శిరీష్ భరద్వాజ్ సైతం మరో వివాహం చేసుకున్నాడు.

Related Posts