సెప్టెంబర్ 27న ‘దేవర’ విడుదలకు ఆల్ సెట్ అయ్యింది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ‘దేవర’ సినిమా టికెట్ రేట్లు పెంపుతో పాటు స్పెషల్ షోస్ కి జీవో జారీ చేసింది. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా ‘దేవర’ టికెట్ రేట్లు పెంపుకు, ప్రత్యేక షో స్ కి అనుమతులు జారీ చేసింది.
సెప్టెంబర్ 27న సినిమా విడుదలయ్యే రోజు అర్థరాత్రి 1 గంటలకు స్పెషల్ షోస్ కి అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ లోని 29 థియేటర్లలో ఈ అర్థరాత్రి షోకి అనుమతి లభించింది. స్పెషల్ షోలకు టికెట్ ధర రూ.100 పెంచుకునే అవకాశం కల్పించింది.సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.25, మల్టీప్లెక్స్‌ల్లో రూ.50 వరకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది