HomeMoviesటాలీవుడ్సోషల్ మీడియా క్వీన్ శ్రద్ధా కపూర్!

సోషల్ మీడియా క్వీన్ శ్రద్ధా కపూర్!

-

బాలీవుడ్ నంబర్ గేమ్ లో ఒక్కోసారి ఒక్కో నటీమణి ముందుకు వస్తోంది. వాళ్లు నటించిన సినిమాలు, సక్సెస్ లు ఆధారంగా నంబర్ గేమ్ ను డిసైడ్ చేస్తారు. అయితే.. సోషల్ మీడియా యుగంలో ప్రజాదరణను ఫాలోవర్ల సంఖ్యతో కొలుస్తారు. సోషల్ మీడియాలోని అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తులను అత్యంత ప్రజాదరణ వారిగా భావించవచ్చు.

ఆ లెక్కన ఇప్పుడు బాలీవుడ్ లోని నటీమణుల్లో అగ్ర స్థానంలో ఉంది శ్రద్ధా కపూర్. లేటెస్ట్ గా శ్రద్ధ ఇన్‌స్టాగ్రామ్ లో 93.6 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ ఘన విజయాన్ని సాధించింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.873 కోట్ల వసూళ్లను సాధించింది.

ఇక.. ఇన్‌స్టాగ్రామ్ లో ఇండియాలోని అత్యధిక ఫాలోవర్స్ కలిగిన నటీమణుల్లో శ్రద్ధా కపూర్ తర్వాత ప్రియాంక చోప్రా, అలియా భట్, కత్రిన కైఫ్, దీపికా పదుకొణె వంటి వారున్నారు. మొత్తంగా.. ‘సాహో’ సినిమాతో సౌత్ కి సైతం పరిచయమైన శ్రద్ధా కపూర్.. ప్రస్తుతం నాని-శ్రీకాంత్ ఓదెల రెండో సినిమాలో నాయికగా నటిస్తుందనే ప్రచారం ఉంది

ఇవీ చదవండి

English News