ఆశే ఈ లోకాన్ని నడిపిస్తుంది. అదే ఆశ మన లైఫ్‌ ని నిర్ణయిస్తుంది… ఇదీ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ ట్రైలర్ లోని ఫస్ట్ డైలాగ్. ఈ డైలాగ్ ను బట్టే ఈ కథేంటో అంచనా వేయొచ్చు. కానీ కథనం మాత్రం ఆకట్టుకుంటుంది అనేలా ఉందీ ట్రైలర్.

డబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి మధ్య తరగతి కుర్రాడికీ ఉంటుంది. కానీ అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. అలా వచ్చిన ఓ అవకాశాన్ని వాడుకుని డబ్బు సంపాదించాలనుకున్న ఓ కుర్రాడి లైఫ్‌ లో జరిగిన పరిణామాలేంటీ అనేది పాయింట్. అయితే ఈ పాయింట్ కు సిద్ధార్థ్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఓ రేంజ్ లో రొమాన్స్ ను యాడ్ చేశారు. పైగా ఆ రొమాంటిక్ యాంగిల్ చుట్టూనే మనోడి ‘లైఫ్‌ యాంబిషన్’ కూడా ఉంటుంది. దీంతో కథనం మంచి రసవత్తరంగా మారేందుకు సరిపడా అంశాలన్నీ కుదిరినట్టుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.


బిజినెస్ డీల్ లో భాగంగా తన పెళ్లి చేయాలనుకున్న ఓ కోటీశ్వరుడి కూతురు ఇంట్లోంచి బయటకు వస్తుంది. అనుకోకుండా హీరో పరిచయం అవుతాడు. ప్రేమ పెళ్లి లేకుండా తనతో ఏమైనా చేయొచ్చు అనే విశాలమైన భావాలున్న ఆ యువతితో మనోడి మంచి రొమాన్స్ కూడా పండిస్తాడు.

కట్ చేస్తే అక్కడి నుంచి కథ క్రైమ్ లోకి ఎంటర్ అవుతుంది. లవ్ లేని ఈ కథలో కావాల్సినత చేజ్ లు మాత్రం ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా చాలా గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ టక్కర్ మూవీ ట్రైలర్ కు మంచి స్పందనే వస్తోంది. సిద్ధార్థ్ సరసన మజిలీ, మైఖేల్ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ జి క్రిష్‌ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 26న విడుదల కాబోతోంది. మహా సముద్రం తర్వాత సిద్ధార్థ్ నటించిన ఈ మూవీ నిజానికి తమిళ్ నుంచి తెలుగులోకి డబ్ అయింది. మరి ఈ మూవీతో ఈ మాజీ లవర్ బాయ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

, , , , , , ,