HomeMoviesటాలీవుడ్'పుష్ప 2' ఐటెమ్ సాంగ్‌లో శ్రద్ధా కపూర్!

‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్‌లో శ్రద్ధా కపూర్!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప.. ది రూల్’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఒక్క ఐటెమ్ సాంగ్ తప్ప. అసలే అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో స్పెషల్ సాంగ్ కి స్పెషల్ క్రేజుంది. వీరిద్దరికీ తోడు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ కూడా కలవడమే అందుకు ప్రధాన కారణం.

Ppp

‘పుష్ప 1’ ఐటెమ్ నంబర్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు ‘పుష్ప 2’లోని స్పెషల్ సాంగ్ గురించి స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ సాంగ్ కోసం ఓ రాకింగ్ ట్యూన్ ఇచ్చాడట రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్. ఇక.. నవంబర్ లో చిత్రీకరించే ఈ పాటలో బన్నీతో పాటు నర్తించే నాయిక కోసం చాలా రోజులుగా సెర్చింగ్ జరుగుతుంది.

Sk

ఇప్పటికే ఈ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల, జాన్వీ కపూర్, త్రిప్తి డిమ్రి వంటి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. లేటెస్ట్ గా ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ కనిపించబోతుందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ప్రచారం. ఈ ఏడాది ‘స్త్రీ 2’తో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన శ్రద్ధ కపూర్.. మంచి డ్యాన్సర్ కూడా. అందుకే.. ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ కోసం ఆమెను ఎంపిక చేసుకున్నారట. శ్రద్ధా కపూర్ ఈ పాట కోసం రూ.4 కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందని.. నిర్మాతలు ఆమె డిమాండ్‌కు ఒప్పుకున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 6న ‘పుష్ప 2’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవీ చదవండి

English News