కింగ్ నాగార్జున ఓ ప్రధాన పాత్రలో.. ధనుష్ టైటిల్ రోల్ లో కనిపించబోతున్న చిత్రం ‘కుబేర’. నేషనల్ క్రష్ రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. ఈ గ్లింప్స్ లో కుబేర ప్రపంచాన్ని పరిచయం చేశాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. నాగార్జున, ధనుష్, రష్మిక పాత్రలను ఈ గ్లింప్స్ లో చూపించారు.
‘కుబేర’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యిందట. ఇప్పటికే టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీలో కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ‘కుబేర’ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, అమిగోస్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని 2025 ప్రథమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.