శేఖర్ కమ్ముల – ధనుష్ ఆగినట్టే.. నా ..?

సెన్సిబుల్ మూవీ మేకర్ శేఖర్ కమ్ముల, ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ ధనుష్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పుడు అదో సెన్సేషన్ అయింది. నిజంగా దీన్ని రేరెస్ట్ కాంబినేషన్ గానే చూశారు. తెలుగులోనే కాక తమిళ్ లో కూడా చాలామంది వెరైటీగా ఫీలయ్యారు. పైగా శేఖర్ కమ్ముల ఇప్పటి వరకూ పెద్ద స్టార్‌స్ తో సినిమాలు చేయలేదు కాబట్టి.. వీరి కలయికలో వచ్చే సినిమా ఎలా ఉంటుందా.. కథ ఏమై ఉంటుందా అనే క్యూరియాసిటీతో కూడిన కూపీలు చాలా కనిపించాయి..

అయితే ఈ కాంబోలో మూవీ అనౌన్స్ అయి ఇప్పటికే ఎనిమిది నెలలకు పైగా అవుతోంది. ఈ గ్యాప్ లో ధనుష్ తెలుగులోనే సార్ అనే మూవీ చేశాడు. బట్ శేఖర్ కమ్ముల సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ వినిపించడం లేదు. రీసెంట్ గా త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందనే వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాదు. ఇంకా చెబితే ఈ క్రేజీ కాంబోలో అనౌన్స్ అయిన సినిమా ఆగిపోయినట్టే అని కూడా వినిపిస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు.


ప్రస్తుతం ధనుష్ తన 50వ సినిమాకు సిద్ధమవుతున్నాడు. అంతేకాక ఈ చిత్రానికి తనే దర్శకుడు కూడా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. 50వ సినిమా అంటే ఎవరికైనా మెమరబుల్.సో ఫోకస్ అంతా ఈ చిత్రంపైనే ఉంటుంది. తనే దర్శకుడు కాబట్టి వేరే ఆలోచనలేవీ రాకుండానే చూసుకుంటాడు. ఆ ఆలోచనల్లో శేఖర్ కమ్ముల కూడా ఉంటాడు. ఇక ఈ చిత్రానికి దాదాపు యేడాది టైమ్ పడుతుందనేది కోలీవుడ్ నుంచి వస్తోన్న వార్త.

ఈ మూవీతో ప్యాన్ ఇండియన్‌ రేంజ్ లో తన దర్శకత్వ ప్రతిభను చూపించబోతున్నాడు ధనుష్‌. అందుకే అంత టైమ్ పడుతుందంటున్నారు. ఆ తర్వాత అన్నీ కుదిరితే శేఖర్ కమ్ములతో సినిమాకు వస్తాడు. అంటే ఈ మూవీ షూటింగ్ అయిపోయి రిలీజ్ టైమ్ వరకూ రావాలంటే ఎంత లేదన్నా.. 2024 చివర్లో లేదా 2025 వరకూ ఆగాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే శేఖర్ కమ్ముల సినిమా లవ్ స్టోరీ విడుదలై యేడాది కావొస్తోంది.

మరో యేడాది వరకూ ఖాళీగా ఉండటం కష్టమే. అందుకే శేఖర్ కమ్ముల ధనుష్‌ తో కాకుండా తనదైన శైలిలో మరో ప్రాజెక్ట్ ను సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు అంటున్నారు. సో.. చూస్తోంటే.. చాలామంది చాలా ఆసక్తిగా చూసిన ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఆగిపోయినట్టే అంటున్నారు.

Related Posts