సప్తసాగరాలు దాటి ట్రైలర్ .. ఎలా ఉంది

కన్నడలో సూపర్ హిట్ అయిన సప్తసాగర దాచె ఎల్లో చిత్రాన్ని తెలుగులో సప్తసాగరాలు దాటి అనే పేరుతో డబ్ చేశారు. ఈ మూవీ ఈ నెల 22న విడుదల కాబోతోంది. కన్నడలో వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి హీరోయిన్. హార్ట్ టచింగ్ పొయొటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.


ఈ ట్రైలర్ చూస్తే అభిరుచి ఉన్న ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ మూవీలా కనిపిస్తోంది. ట్రైలర్ లో ఎక్కువ భాగం డైలాగ్స్ తోనే నిండి ఉంది. ముఖ్యంగా సముద్రం అంటే విపరీతంగా ఇష్టపడే ఒక అమ్మాయి.. అంతకంటే ఎక్కువగా ప్రేమించిన అబ్బాయికి మధ్య అనుకోని దూరం ఎదురైతే.. ఆ దూరాలను తరిగించేందుకు ఆమె తన భావాలను క్యాసెట్ రూపంలో రికార్డ్ చేసి అతనికి పంపించడం.. అవి చూసి అతను తన ప్రేయసిని చేరాలని తాపత్రయపడటం. దీనికి తోడు అతను విదేశాల్లో ఉంటూ అనుకోని తప్పుకు బలై అక్కడ జైల్లో మగ్గుతూ.. మరోవైపు తన ప్రేయసి అతని రాక కోసం చూస్తుండగా.. ఈ మొత్తం మనసును మెలిపెట్టే విజువల్స్, మ్యూజిక్ తో మెస్మరైజింగ్ గా ఉందని చెప్పాలి.


ఓ రకంగా చూస్తే ఇది ఒక హానెస్ట్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. దానికి అద్భుతమైన సంగీతం.. మంచి నటులు, డైలాగ్స్ వీటికి మించిన దర్శకత్వం అన్నీ గొప్పగా కనిపిస్తున్నాయీ ట్రైలర్ చూస్తోంటే. కన్నడలో మెల్లగా హిట్ ట్రాక్ ఎక్కిందీ సినిమా. మొదట స్లో నెరేషన్ అన్న టాక్ వచ్చింది. దాన్ని దాటుకుని పొయొటిక్ లవ్ స్టోరీ అన్న టాక్ తెచ్చుకుంది. మరి తెలుగులో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

Related Posts