‘ఊరుపేరు భైరవకోన’ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న సందీప్ కిషన్ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. ‘ధమాకా’తో వెండితెరపై వంద కోట్లు కొల్లగొట్టిన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే గ్రాండ్ గా ముహూర్తాన్ని జరుపుకున్న ఈ సినిమా తాజాగా పట్టాలెక్కింది.
సందీప్ కిషన్ కెరీర్ లో 30వ చిత్రమిది. ఇప్పటికే పక్కాగా ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తవ్వడంతో.. ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. లవ్ అండ్ ఎమోషన్స్ తో కూడిన పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక.. నక్కిన త్రినాథరావు గత హిట్ చిత్రాలలో భాగస్వామ్యమైన రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూరుస్తుండడం విశేషం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.