HomeMoviesటాలీవుడ్సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత

సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత

-

స్టార్ హీరోయిన్ సమంతకు తీరని విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ‘మళ్లీ మిమ్మల్ని కలిసేంత వరకు.. సెలవు నాన్న’ అని ఆమె భావోద్వేగపూరితంగా పేర్కొన్నారు. అయితే ఆయన మరణానికి సంబంధించి మరింత సమాచారం ఆమె వెల్లడించలేదు.

చెన్నైలోని ఒక ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ జోసెఫ్ ప్రభు మరణించారని తెలుస్తోంది. తెలుగు ఆంగ్లో-ఇండియన్ అయిన జోసెఫ్ ప్రభు, మలయాళి కుటుంబానికి చెందిన నినెట్ ప్రభును వివాహం చేసుకున్నారు. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఎల్లప్పుడూ చిత్ర పరిశ్రమకు దూరంగానే ఉండేవారు. ఈ సంఘటన సమంత అభిమానులను కూడా ఎంతో బాధకు గురి చేసింది. సమంతకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున సానుభూతి తెలియజేస్తున్నారు.

ఇవీ చదవండి

English News