HomeMoviesటాలీవుడ్'సలార్ పార్ట్ 2'.. శౌర్యంగ పర్వం షూటింగ్ ప్రారంభం!

‘సలార్ పార్ట్ 2’.. శౌర్యంగ పర్వం షూటింగ్ ప్రారంభం!

-

ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టుగా ఊర మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ సంచలన విజయాన్ని సాధించింది. అయితే.. ‘సలార్’లోని అసలు సిసలు విజువల్ ఫీస్ట్ ను ఆస్వాదించాలంటే సెకండ్ పార్ట్ వచ్చే వరకూ ఆగాల్సిందే. మరి ‘సలార్ 2’ ఎప్పుడు మొదలవుతోంది? అసలు ఉంటుందా? లేదా? అంటూ బోలెడు ప్రశ్నలు ఈమధ్య కాలంలో జోరందుకున్నాయి. వాటన్నంటికీ సమాధానంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్.

ఎలాంటి హడావుడి లేకుండా ‘సలార్-2’ని సైలెంట్ గా సెట్స్ పైకి తీసుకెళ్లాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈరోజు ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా ‘సలార్-2’ షూటింగ్ ప్రారంభించారట. ప్రభాస్ కూడా ఈ సినిమా సెట్స్‌లో చేరినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ 20 రోజుల పాటు కొనసాగనుందట. ఒకవైపు ‘సలార్-2’ని తెరకెక్కిస్తూనే.. మరోవైపు ఎన్టీఆర్ చిత్రాన్ని కూడా పూర్తి చేసేలా ప్లానింగ్ రెడీ చేశాడట ప్రశాంత్ నీల్.

‘సలార్ 2’లో పృథ్వీరాజ్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రుతి హాసన్ నాయికగా నటిస్తుంది. ఫస్ట్ పార్ట్ కి పనిచేసిన టెక్నికల్ టీమ్ అంతా సెకండ్ పార్ట్ కి వర్క్ చేస్తుందట. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘సలార్-2’ రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారట.

ఇవీ చదవండి

English News